New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు కరోనా వైరస్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్

New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ బ్రిటన్‌లో కలకలం రేపుతున్న నేపథ్యంలో గత రెండు వారాలుగా విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.

Last Updated : Dec 25, 2020, 09:41 AM IST
New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు కరోనా వైరస్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్

New CoronaVirus In Telangana:  బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ బ్రిటన్‌లో కలకలం రేపుతున్న నేపథ్యంలో గత రెండు వారాలుగా విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి వచ్చిన 1200 మందిలో 846 మందిని గుర్తించినట్లు చెప్పారు.

వీరికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) వెల్లడించారు. అయితే వీరిలో పాత కరోనా వైరస్ ఉందో లేక కొత్త కరోనా వైరస్ బారిన పడ్డారో తెలుసుకునేందుకు సీసీఎంబీకి నమూనాలు పంపినట్లు పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో అధికంగా హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, జగిత్యాల, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా నెగటివ్ వచ్చిన వారి కదలికలను సైతం పరిశీలిస్తున్నామని మంత్రి వివరించారు.

Also Read: Amazon Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బంపర్ ఆఫర్లు ఇవే.. 

తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాక్సిన్ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. టీకా వేసేందుకు ఇదివరకే 10వేల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఒక్కో ఆరోగ్య సిబ్బంది రోజుకు 100 మందికి వ్యాక్సిన్ చేసినా.. రోజుకు 10 లక్షల మంది వరకు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయడం సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో తొలి దశలో 70 నుంచి 80 లక్షల మందికి కరోనా టీకాలు వేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్

కరోనా వైరస్ వ్యాప్తితో పాటు కొత్త వైరస్ పుట్టుకురావడంతో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి లాంటి ముఖ్య వేడుకలు, పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. భౌతిక దూరం పాటించాలని, ఇళ్ల నుంచి బయటకు వస్తే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.

Also Read: ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2020 ఫలితాలు లింక్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x