నిజాం పాలకుల్లో చివరివాడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ నీతి అయోగ్ అధికారులపై విరుచుకుపడ్డారు. ఫలక్ నామా ప్యాలెస్ నిజాం సంస్కృతికి చిహ్నమని.. అలాంటి రాజభవనంలో జరిగిన విందుకు కనీస మర్యాదగానైనా.. తనకు పిలవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. " నీతి ఆయోగ్ అధికారులు గత పది రోజులుగా నన్ను సంప్రదించారు. విందు నిర్వహణ కోసం సమాచారం సేకరించారు.


ఆఖరికి విదేశీ వనితైన ఇవాంక ట్రంప్ కోసం నిజాం గదిని కూడా బుక్ చేశారు. ఫలక్ నామా వేదికగా భారత ప్రధాని మోదీ, అమెరికా సలహాదారు ఇవాంకా ట్రంప్‌కు విందు అందిస్తున్నారని తెలిపారు.  అయితే అంత ముఖ్యమైన విందు కార్యక్రమానికి నన్ను కనీసమర్యాద కోసమైనా పిలవలేదు. అదీ వాళ్ళ సంస్కారం. పూర్తి నిజాం సంప్రదాయంతో నిండిన వంటలు చేశారు. అదే సంప్రదాయం ప్రకారం ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే మా కుటుంబాన్ని పిలవడం మాత్రం మర్చిపోయారు" అని ఆయన వాపోయారు.