Telangana: తెలంగాణతో పాటు.. మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ ఖరారైంది. ఎన్నికల తేదీ ఫిక్స్ అవగానే తెలంగాణ రాజాకీయ పార్టీలు ఎన్నికల తగు విధంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి పాలనతో రికార్డు సృష్టించాలని బీఆర్ఎస్ నేతలు ఉంటే.. ప్రజల్లో కాంగ్రెస్ కు మద్దతు పెరిగిందని.. ఈ సారి మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది. వీరితో పాటుగా బీజీపీ కూడా ఎన్నికల పోరులో తగిన ఎత్తుగడలు వేస్తూనే ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయ పార్టీలు.. నేతలు.. కార్యకర్తలు.. ఎలా ఎన్నికల్లో గెలవాలి వ్యూహా రచనలలో ఉంటే.. ఎన్నికల కమీషన్ సీఎం కేసీఆర్ కు షాక్ నిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు  కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లు,  రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకూండా..  వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ను కూడా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీ చేయాలనీ ఎలక్షన్ కమీషన్ సూచించింది. వీరితో పాటుగా  రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి చేయాలనీ సూచించింది.   ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని.. రేపు సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 


Also Read: Low BP Remedies: నిర్లక్ష్యం చేస్తే లో బీపీ ప్రాణం తీయవచ్చు, ఈ 3 చిట్కాలతో ఇట్టే మాయ


రాష్ట్రంలో 13 మంది పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ చేసిన 13 మంది ఎస్పీల్లో 9 మంది నాన్ కేడర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో పాటు వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నిర్మల్ ఎస్పీలను బదిలీ చేసింది.


మునుగోడు ఉప ఎన్నిక సమయంలో  ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రవాణా శాఖ కార్యదర్శి, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ను కూడా తొలగించాలని కమిషన్‌ ఆదేశించింది.


Also Read: Asia Richest Person 2023: హారున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023, ఆసియా కుబేరుడు అంబానీనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి