Asia Richest Person 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హారున్ ఇండియా జాబితా ప్రకారం ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అటు గౌతమ్ అదానీకు ఎదురుదెబ్బ తగిలింది. ముకేశ్ అంబానీ తన సంపదను నాలుగు రెట్లు పెంచుకున్నారు.
హారున్ ఇండియా ధనవంతుల జాబితా 2023 విడుదలైంది. ఈ జాబితా ప్రకారం బారతదేశం పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో ఆయన ముకేశ్ అంబానీ ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. 2014లో 1,65,100 కోట్లున్న సంపద ఇప్పుడు 8,08,700 కోట్లుగా మారింది. హారున్ ఇండియా జాబితా ప్రకారం ముకేశ్ అంభానీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. దేశంలో రోజురోజుకూ ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. తమ సంపదను కూడా గణనీయంగా పెంచుకుంటున్నారు.
అదే సమయంలో దేశవ్యాప్తంగా ధనవంతుల సంఖ్య కూడా 38 శాతం పెరిగింది. సంపన్నుల సంపద విలువ గత ఐదేళ్లతో పోలిస్తే 76 శాతం పెరిగింది. దేశంలోని మొత్తం 1319 మంది సంపన్నుల ఆస్థి విలువ 1000 కోట్లకు పైగా ఉంది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ 2,28,900 కోట్లతో నాలుగవ స్థానంలో ఉన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న బిలియనీర్ల సంఖ్య 259గా ఉంది. హారున్ ఇండియా వివరాల ప్రకారం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 4,74,800 కోట్లతో రెండవ స్థానంలో ఉండగా, 2,78, 700 కోట్లతో సైరస్ పూణావాలా మూడో స్థానంలో ఉన్నారు.
ఇక గోపీచంద్ హిందూజా 1,76,500 కోట్లతో ఐదవ స్థానంలో ఉండగా, 1,64,300 కోట్లతో దిలీప్ సింఘ్వీ ఆరవ స్థానంలో ఉన్నారు. ఎల్ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ 1,62,300 కోట్లతో 7వ స్థానంలో నిలవగా, 1,43,900 కోట్లతో రాధాకిషన్ దమానీ 8వ స్థానంలో ఉన్నారు. ఇక 1,25,600 కోట్లతో కుమార మంగళం బిర్లా 9వ స్థానంలో నిలిస్తే 1,20,700 కోట్లతో నీరజ్ బజాజ్ 10వ స్థానంలో ఉన్నారు.
Also read: PM Kisan Status: రైతులకు శుభవార్త.. రూ.8 వేలకు పెంచనున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook