హైదరాబాద్‌: తెలంగాణలోని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఆయా కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు tgugcet.cgg.gov.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌ ద్వారా టీజీయూజీ సెట్‌-2019 దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌ తెలిపారు. ఈనెల 22 దరఖాస్తుకు చివరితేదీ కాగా జూన్‌ 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్‌లో 40% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు. 


రాష్ట్రంలో 30 సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలు, 22 ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో వున్న సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామని ప్రవీణ్ కుమార్‌ తెలిపారు. ఇక్కడి కళాశాలల్లో చదువుకునే ప్రతీ విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం రూ.75 వేలు ఖర్చు చేసి మరీ నాణ్యమైన విద్యను అందిస్తోందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.