MBA Gold Mealist Turned Thief: అతను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్.. చేసేది మాత్రం దొంగతనాలు.. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది పచ్చి నిజం. చదువులో టాపర్ అయిన అతను కెరీర్ విషయంలో పూర్తిగా దారి తప్పాడు. జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ వేటలో దొంగతనాలు ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఇప్పటివరకూ 200 దొంగతనాలు చేసిన అతను ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తీరు మారలేదు. తాజాగా మరో దొంగతనం కేసులో హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ సామ్ రిచర్డ్ 2004లో ఎంబీఏ పూర్తి చేశాడు. అందులో అతను గోల్డ్ మెడల్ సాధించాడు. చదువుల్లో టాపర్ అయిన వంశీకృష్ణ.. ఆ తర్వాత పూర్తిగా జల్సాల్లో మునిగిపోయి దారి తప్పాడు. జల్సాల కోసం ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఈజీ మనీ కోసం దొంగగా మారాడు. ఓవైపు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు దొంగతనాలు చేసేవాడు.


ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు ఏపీలోని పలుచోట్ల ఇప్పటివరకూ 200 దొంగతనాలు చేశాడు. చాలాసార్లు పట్టుబడి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోని వంశీకృష్ణ గత నెలలో హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇదే కేసులో తాజాగా వంశీకృష్ణను గాంధీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షలు నగదు, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 


వంశీకృష్ణపై గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. గతంలో అతను సుమారు ఐదున్నరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించారు. ఈజీ మనీ కోసమే దొంగతనాలకు అలవాటుపడ్డాడని తెలిపారు. ప్రస్తుతం వంశీకృష్ణపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


Also Read: Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?


Also Read: ED Raids Vivo: హైదరాబాద్‌లో 'వివో' కార్యాలయంపై ఈడీ దాడులు... ఏకకాలంలో 44 చోట్ల సోదాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook