ED Raids Vivo: దేశంలోని చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల ప్రధాన కార్యాలయాలపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 44 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వివో కార్యాలయంలో ఏడుగురు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒప్పో కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తులో భాగంగా తాజా సోదాలు జరుగుతున్నాయి. చైనా కంపెనీలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగిన సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఈ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఐటీ, ఈడీ నిఘా పెట్టాయి.
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై మంగళవారం (జూలై 5) నుంచి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాల్లోని సంస్థ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మనీ లాండరింగ్ ఆరోపణలు ఇలా వెలుగులోకి:
జమ్మూకశ్మీర్‌కి చెందిన ఓ వివో డిస్ట్రిబ్యూటర్‌పై గత నెలలో ఢిల్లీ పోలీస్ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగం (EOW)లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వివో కంపెనీకి చెందిన ఇద్దరు చైనీస్ వాటాదారుల గుర్తింపు పత్రాలను అతను ఫోర్జరీ చేశాడనే ఆరోపణలున్నాయి. డొల్ల కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిపేందుకే ఈ ఫోర్జరీ వ్యవహారం నడిచిందని ఈడీ అనుమానిస్తోంది.
అంతేకాదు, దేశంలో వివో కంపెనీకి చెందిన పలు డొల్ల కంపెనీలను కూడా ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వివో కంపెనీ కార్యాలయాలపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అయితే మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇప్పటివరకూ ఈడీ నుంచి కానీ, వివో యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోదాలకు సహకరిస్తున్నట్లు వివో కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చట్టాలకు లోబడే తమ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయని.. అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.
Also Read: Keeravani: రసూల్ ను దారుణమైన పదంతో ట్రోల్ చేసిన కీరవాణి.. ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: LPG Price Hike: అచ్చెదిన్ ఆగయా.. ప్రధాని మోడీకి చప్పట్లు! గ్యాస్ ధరలపై కేటీఆర్ సెటైర్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook