IAS Transfers and Postings: రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పాలనలో ఒక మార్క్‌ చూపిస్తోంది. గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలంగా ఉన్న అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను మార్చిన ప్రభుత్వం తాజాగా మరోసారి ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఆరుగురు అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొందరికి పోస్టింగులు ఇస్తూ ప్రకటన విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గా ఎన్. శ్రీధర్, పశు సంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమయ్ కుమార్‌, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా వినయ్ కృష్ణా రెడ్డి, రవాణా, రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌, టీఎస్ఐఆర్డీ సీఈఓగా కాత్యాయని, గనులు భూగర్భ శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వీరిలో అమోయ్‌ కుమార్‌ గత ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్నారు. త్వరలో మరికొందరి బదిలీలు, వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులు ఉంటాయని సమాచారం.

సీనియర్‌ అధికారులపై గురి
గత ప్రభుత్వంలో రిటెరైన అధికారులు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా విధులు నిర్వహిస్తున్న వారిపై ఇటీవల ప్రభుత్వం దృష్టి సారించింది. అలా ఉన్న అధికారుల వివరాలను ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. రిటెరైన అధికారులను పంపించే యోచన ప్రభుత్వం చేస్తోంది. దానికన్నా ముందు ఆ అధికారులు చేసిన పనులపై వివరాలు కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఆయా శాఖల్లో ఆ అధికారులు ఏమైనా అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారా అని వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఒకవేళ అలాంటి వారు ఉంటే వారిపై విచారణ కూడా చేసే అవకాశం ఉంది.

Also Read: MLA vs Chiarperson: ఎమ్మెల్యే దాదాగిరిపై తిరగబడ్డ మహిళా చైర్మన్‌.. 'ఎమ్మెల్యే చెప్తే లేచి నిలబడాల్న?


Also Read: JanaSena Party: జనసేనకు డబుల్‌ బొనాంజా.. జానీ మాస్టర్‌, పృథ్వీ చేరిక.. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook