హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ యాక్సిడెంట్
గతేడాది నవంబర్ నెలలో గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీదుగా అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి కింద పడిపోయిన కలకలం రేపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: నగరంలో మరో ఫ్లై ఓవర్ కారు ప్రమాదం జరిగింది. భరత్ నగర్ ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా ఓ కారు అదుపుతప్పి కింద పడిపోయింది. మంగళవారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయింది డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: మహిళ మృతదేహాన్ని వెలికితీసి గుండుగీసి!
ఫ్లై ఓవర్ పైనుంచి కారు పడుతున్న సమయంలో కింద ఎవరు లేకపోవడంతో మరింత ప్రమాదం తప్పింది. గతంలో గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీదుగా అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి కింద పడిపోయిన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ చనిపోయారు. డ్రైవిండ్ చేసిన వ్యక్తికి గాయాలయ్యాయి. దాదాపు నెలన్నరపాటు మూసివేసిన తర్వాత పూర్తి జాగ్రత్తలు తీసుకుని, వేగ నియంత్రణ నియమాలతో సేవల్ని పునరుద్దరించారు.
Also Read: ‘దిశ చెల్లెలి విషయంలో జాగ్రత్త పడుతున్నాం’
Also Read: నెటిజన్ ‘పెంట’ కామెంట్‌పై అనసూయ ఏమన్నారంటే!