జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం
Hyderabad నగరంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.
హైదరాబాద్: నగరంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్క అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తి మృతిచెందాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కేటీఎం బైక్‌పై ఓ యువకుడు అతివేగంగా వెళ్తున్నాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే ఓ కుక్క బైకుకు అడ్డుగా వచ్చింది.
Also Read: ఆ యువతిని తల్లిదండ్రులే కడతేర్చారు.. కారణం తెలిస్తే షాక్!
తొలుత కుక్కను ఢీకొట్టిన బైక్ అనతరం పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. డివైడర్ మీద పడ్డ యువకుడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్ ఢీకొట్టడంతో కుక్క కూడా చనిపోయింది. వీరితో పాటు అటుగా వెళ్తున్న మరో వ్యక్తిని బైకు ఢీకొనడంతో అతడు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా
హెల్మెట్ ధరించి ఉంటే..
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు అభిప్రాయపడ్డారు. గతవారం భరత్ నగర్ ఫ్లై ఓవర్ మీద నుంచి కారు కిండపడి ఒకరు చనిపోగా, మియాపూర్‌లో హోటల్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి చనిపోవడం తెలిసిందే. వీటితో పాటు ఆదివారం జరిగిన ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
See Photos: ఫొటోషూట్ కోసం టాప్ లేపిన ముద్దుగుమ్మలు!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి