హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి 4 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని, పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులు 8.45 లోపే పరీక్ష కేంద్రాలను చేరులోవాలని సూచించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేక కార్యదర్శి చిత్ర రామచంద్రన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను ఉదయం 8.45 లోపే చేరుకోవాలని, 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ తో 9 గంటల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే ఉదయం 9 గంటల తర్వాత ఏ విద్యార్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, పేజర్లు, కాలిక్యులేటర్లు, ముద్రించిన, వ్రాసిన వస్తువులను అనుమతించరని పేర్కొన్నారు. విద్యార్థుల సౌలభ్యం కొరకు పరీక్షా కేంద్రాన్ని గుర్తించటానికి వీలుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని  తెలిపింది. 


పరీక్షలు సజావుగా నిర్వహించడానికి, జిల్లా కలెక్టర్‌తో ఛైర్మన్, పోలీస్ సూపరింటెండెంట్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఒక సీనియర్ ప్రిన్సిపాల్, ఒక సీనియర్ జూనియర్ లెక్చరర్‌తో కూడిన సభ్యులు ఉండే విధంగా జిల్లా స్థాయి హై పవర్ కమిటీని ఏర్పాటు చేశామని బోర్డు కార్యదర్శి తెలిపారు. 


మరోవైపు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విదంగా విద్యా, పోలీసు, రెవెన్యూ విభాగాలతో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అన్నీ పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ కెమెరాల పరిధిలోనే ప్రశ్నపత్రాన్ని తెరవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..