అర్థరాత్రి కారు బీభత్సం..ఒకరు మృతి
హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఈ ప్రమాదం జరిగింది. పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపైకి కారు దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో ఉన్న యువతులు తప్పతాగి ఓవర్ స్పీడ్‌తో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారని, ఈ క్రమంలో ఆ కారు ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లి అతని మృతికి కారణమైందని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.