Orchestra troupe dancer Sharin Fatima suspicious death in old city hyderabad: హైదరాబాద్‌ లో ఫ‌ల‌క్‌ నుమా పరిధిలో అనుమానాస్పద స్థితి లో ఓ డ్యాన్సర్‌ మృతి చెందింది. డ్యాన్సర్ ఫాతిమా మృతదేహం వీధిలో అర్ధనగ్నంగా పడి ఉందంటూ తొలుత వార్తలు వచ్చాయి. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు (Police) రంగప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. డ్యాన్సర్ మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఫాతిమా (Fatima) భర్త ఏడాది క్రితం మరణించాడు. వారిని తానే పోషిస్తూ వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ఆమె పూల్ బాగ్ (phool bhag) నుంచి ముస్తఫానగర్ కు (Mustafanagar) మకాం మార్చినట్లు పోలీసులు చెప్పారు. చున్నీ చుట్టి గొంతుకు బిగించినట్లు ఉందని తెలిపారు. ఫాతిమా ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు. 


ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్‌ ఫాతిమాకు (Sharin Fatima) ఏడుగురు సంతానం. ఫాతిమా భర్త నదీమ్ (Nadeem) ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా (Orchestra Troupe Dancer‌) పనిచేస్తూ తల్లి ఫాతిమానే పోషించుకునేది.


Also Read : Nalgonda: నల్గొండలో నిత్యపెళ్లికొడుకు.. ఏకంగా 19 మంది మహిళలను..


మూడ్రోజల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంది ఫాతిమా. తర్వాత వస్తువులను షిఫ్ట్‌ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందింది. తమ సోదరిని హత్య (Murder) చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో తండ్రిని కోల్పొయిన ఫాతిమా పిల్లలు ఇప్పుడు తల్లిని కూడా కోల్పొవడంతో అనాథలయ్యారు.


అయితే ఫాతిమా అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించిందని.. మృతదేహం పక్కన మద్యం సీసా (Alcohol bottle) ఉండడం.. ఆమె గొంతును నులిమిన ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు (Police) తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు (Case) నమోదు చేసుకున్నామని, హత్యాచారం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప ఫాతిమా మరణానికి కారణాలు తెలియవని పేర్కొన్నారు.


Also Read : DCW summons Justdial : స్పాల బాగోతంపై స్వాతి మలివాల్ సీరియస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook