Osmania Hospital: ప్రభుత్వ హాస్పిటల్స్ లో సిబ్బంది తీరు దారుణంగా ఉంటుంది. కాసుల కోసం ఎంతకైనా దిగజారిపోతుంటారు. కష్టాలతో ప్రభుత్వ హాస్పిటల్స్ కు వస్తుంటారు జనాలు. అలాంటి రోగులను పట్టి పీడిస్తుంటారు. అయినవారు చనిపోయిన పుట్టెడు దుఖంలో ఉన్న బాధితులను కూడా వదిలిపెట్టరు. కాసుల కోసం కిరాతకంగా వ్యవహరిస్తూ ఉంటారు. మృత‌దేహంపై చిల్ల‌ర అడుక్కోవడానికి కూడా వెనుకాడరు. మార్చిరీలోనూ అవినీతి జలగల్లా ఉంటారు. అడిగినంత డబ్బులు ఇస్తేనే డెడ్ బాడీని మార్చురీలోకి తీసుకువెళ్తామని బేరాలు ఆడుతారు. కాళ్లువేళ్లు పట్టుకుని బతిమాలిడినా కనికరించరు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ లో జరుగుతుంటాయి. తాజాగా మరో దారుణ ఘటన ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వ‌ద్ద వెలుగుచూసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాతబస్తీ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ కు చెందిన  మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు మార్చిరీ దగ్గర చుక్కలు కనిపించాయి. అక్కడ డ్యూటీలో ఉన్న వ్యక్తి ఫుల్లుగా మందు కొట్టి ఉన్నాడు. మజీద్ మృతదేహాన్ని లోపలికి అనుమతించలేదు. వెయ్యి రూపాయలు ఇస్తేనే డెడ్ బాడీని మార్చురీలోనికి తీసుకుంటానని తెగేసి చెప్పాడు. బంధువులు ఎంతగా బతిమాలిడినా వినలేదు. మృతదేహంతో పాటు వచ్చిన పోలీసులు చెప్పిన ససేమిరా అన్నాడు మార్చురీ సిబ్బంది.
మద్యం మత్తులో బాధిత బంధువులతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు శవంతోనే హాస్పిటల్ మార్చురీ దగ్గరే గంటపాటు ఉండిపోయారు.


ఉస్మానియా హాస్పిటల్ లో ఇలాంటి ఘటనలు రోజు జరుగుతుంటాయని చెబుతున్నారు. అసలే అయినవాళ్లు చనిపోయిన బాధలో ఉన్న బాధితులను సిబ్బంది దారుణంగా వేధిస్తున్నారని తెలుస్తోంది. పోలీసులు చెప్పినా వినడం లేదంటే వాళ్లు ఎంతగా బరి తెగిస్తున్నారనే అర్ధం చేసుకోవచ్చు. పోలీసులనే లెక్క చేయడం లేదంటే సామాన్యులను ఎంతగా వేధిస్తారో ఊహించవచ్చు. హాస్పిటల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనపై కఠినంగా వ్యవహరించాలని జనాలు కోరుతున్నారు.


READ ALSO: Satyendra Jain Arrest: ఇదో ఫేక్ కేసు... రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్.. సత్యేంద్ర అరెస్టుపై కేజ్రీవాల్


READ ALSO: Theft in KVP House: కాంగ్రెస్ నేత కేవీపీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ... పోలీసులకు ఫిర్యాదు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook