హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఓయూ జేఏసీ నేతలు మద్దతుపలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఆర్టీసి కార్మికులతో కలిసి నిరసనల్లో పాల్గొంటూ వారికి తమ సంఘీభావం ప్రకటిస్తున్న ఓయూ జేఏసి నేతలు.. తాజాగా మంగళవారంనాడు జలదీక్ష చేపట్టారు. సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తలెత్తిందని జఏసి నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం చేయడంతోపాటు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


ఇదిలావుంటే, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా క్యాంపస్‌లో నిరసన చేపట్టిన పలువురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు.