హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నేతలు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కలిశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా విద్యార్థులు జరిపిన పోరాటాన్ని, రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర, అమరుల ఆత్మబలిదానాలు తదితర అంశాలను గవర్నర్‌కు కళ్లకు కట్టినట్లు వివరించిన ఓయూ జేఏసీ నేతలు... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే ఉద్యమాలు చేస్తే... చివరకు ఆరున్నరేళ్లుగా ఒక్క అధ్యాపక పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని జేఏసి నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.