Students Food Poison: పురుగులు పడిన ఆహారం తిని 50 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత
Students Food Poisoning : కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్స్ అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి పరుగులు తీశారు. సంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్ రాజేశ్ ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టి విద్యార్థినులను ఆరాతీయగా హాస్టల్ ప్రిన్సిపల్ నిర్వాకం బయటపడింది.
Students Food Poisoning: నాణ్యత లోపించిన ఆహారం తిని 50 మందికిపైగా స్టూడెంట్స్ ఆస్పత్రిపాలైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్లో శనివారం చోటుచేసుకుంది. అల్పాహారం తిన్న వెంటనే 50 మందికిపైగా స్టూడెంట్స్ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నట్టు స్కూల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమస్య అధికమవడంతో హాస్టల్ ప్రిన్సిపల్ వారిని హుటాహటిన నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్స్ అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి పరుగులు తీశారు. సంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్ రాజేశ్ ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టి విద్యార్థినులను ఆరాతీయగా హాస్టల్ ప్రిన్సిపల్ నిర్వాకం బయటపడింది. ఎప్పటి నుండో నాసిరకం బియ్యంతోనే ఆహారం వండిపెడుతున్నారని.. ఆహారంలో పురుగులు వస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపల్ పట్టించుకోలేదని స్టూడెంట్స్ తెలిపారు.
ది హిందూ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఈ విషయం బయటికి చెబితే చర్యలు తీసుకుంటామని స్టూడెంట్స్‌ని బెదిరించినట్టుగానూ తెలిసింది. నాణ్యత లోపించిన ఆహారంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు.. వారి పిల్లలను హాస్టల్ నుంచి వెనక్కి తీసుకువెళ్తున్నట్టు స్టూడెంట్స్ తెలిపారు. దీంతో నారాయణఖేడ్ మండలంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
స్టూడెంట్స్ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించిన ప్రిన్సిపల్.. స్టూడెంట్స్ ఆస్పత్రి పాలు కావడానికి కారకులుగా భావిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి రాజేశ్ వారిపై చర్యలు తీసుకున్నారు. కస్తూర్భా గాంధీ రెసిడెన్సిషియల్ హాస్టల్ ప్రిన్సిపల్ రాజేశ్వరి సహా ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఐదుగురిని ఉన్నఫళంగా సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన మరొకటి పునరావృతం అయితే, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేశ్ హెచ్చరించారు. నారాయణఖేడ్ ఘటనపై తక్షణమే స్పందించిన జిల్లా వైద్యాధికారి గాయత్రి దేవి... విద్యార్థినుల అస్వస్థతకు గురవడానికి ఫుడ్ పాయిజనే కారణం అని ధృవీకరించారు. నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని నారాయణఖేడ్ పంపించి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు గాయత్రి దేవి తెలిపారు.
Also Read : Sangareddy Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు దుర్మరణం..
Also Read : Telangana: కస్తూర్బా పాఠశాల భోజనంలో బల్లి.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Also Read : Heart Stroke: అప్పటివరకూ ఆడుతూ..గుండెపోటుతో కుప్పకూలిన మూడో తరగతి విద్యార్ధి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook