Kinnera Mogulaiah: నా నోట్లో మన్ను పోస్తారా.. పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా! కిన్నెర మొగులయ్య సంచలనం..
Kinnera Mogulaiah: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రతి విషయంలోనూ రాజకీయమే కనిపిస్తోంది. తాజాగా కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య రాజకీయ రగడకు కేంద్రంగా మారారు. ఆయనకు వచ్చిన పద్మ శ్రీ అవార్డుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన కోటి రూపాయల సాయంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది.
Kinnera Mogulaiah: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రతి విషయంలోనూ రాజకీయమే కనిపిస్తోంది. తాజాగా కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య రాజకీయ రగడకు కేంద్రంగా మారారు. ఆయనకు వచ్చిన పద్మ శ్రీ అవార్డుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన కోటి రూపాయల సాయంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇదే ఇప్పుడు మొగులయ్యకు ఇబ్బందిగా మారింది. తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన మొగులయ్య.. తెలంగాణ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తన నోట్లో మన్ను పోస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అవసరమైతే కేంద్ర సర్కార్ ఇచ్చిన పద్మ శ్రీ అవార్డును తిరిగి వెనక్కి ఇచ్చేస్తానంటూ మొగులయ్య ప్రకటించడం సంచనంగా మారింది.
అసలు వివాదంలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మొగిలయ్య మాట్లాడిన ఓ వీడియోను తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో బండి సంజయ్ ని, బీజేపీని మొగులయ్య కీర్తిస్తున్నట్లుగా ఉంది. దాంతో పాటు సీఎం కేసీఆర్ ను మొగులయ్య తిట్టినట్లుగా కూడా మరో వీడియో వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసీఆర్ తనను మోస చేశారని ఆ వీడియోలో మొగులయ్య చెబుతున్నట్లుగా ఉంది. ఈ వీడియోపైనే మొగులయ్య క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడినట్లుగా ఫేక్ వీడియోను బీజేపీ కార్యకర్తలు క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్ సర్కార్ వల్లే తనకు.. తన కళకు గుర్తింపు వచ్చిందని కిన్నెరసాని మొగులయ్య చెప్పారు. తన కళను గుర్తించి ఆరేళ్ల క్రితమే రవీంధ్ర భారతీలో కేసీఆర్ తనను సత్కరించారని తెలిపారు. కేసీఆర్ నుంచి సత్కారం పొందాకే తాను బయటి ప్రపంచానికి తెలిశానని.. ఆ తర్వాతే తనకు సినిమాలో పాడే అవకాశం వచ్చిందని అన్నారు. కేంద్ర సర్కార్ గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని వివరించారు మొగులయ్య. గత ప్రభుత్వాలు తనను ఎప్పుడూ పట్టించుకోలేదని.. కేసీఆర్ సర్కార్ వచ్చాకే తనకు సాయం అందిందన్నారు.టీఆర్ఎస్, తనకు వివాదం వచ్చేలా బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఫేక్ వీడియోలతో తనను బద్నాం చేస్తున్నారని.. తన నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప
ద్మశ్రీ అవార్డును తామే ఇచ్చామని బీజేపీ ప్రచారం చేసుకుంటుందని మొగులయ్య ఫైరయ్యారు. కేసీఆర్ ప్రకటించిన కోటీ రూపాయలు.. ఆయన ఇంట్లో నుంచి ఇచ్చారా అంటూ కొంతమంది కమలం కార్యకర్తలు తనతో గొడవ పెట్టుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ తీరు మారకపోతే.. కేంద్రం ఇచ్చిన అవార్డును తిరిగి వెనక్కి ఇచ్చేస్తానంటూ సంచలన కామెంట్లు చేశారు మొగులయ్య. తన నోట్లో మట్టి కొట్టాలని చూస్తే పాపం తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. తనకు ఎవరూ లేరని, రాజకీయాల కోసం తనను వాడుకోవద్దని కిన్నెరసాని మొగులయ్య వేడుకున్నారు.
READ ALSO: Big Shock To TRS: కేసీఆర్ కు బిగ్ షాక్! కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ సీనియర్ నేత..
READ ALSO: Rajyasabha Elections: జగన్ కోటాలో బండికి రాజ్యసభ సీటు! కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook