Palvai Sravanthi Resigns Congress Party: కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాకుండా.. కేవలం డబ్బు డబ్బు అనే నినాదంతో నడుస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని మోసం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ  నిలువెత్తున వేలం పాటగా మారింది.. పార్టీ ఫిరాయింపుదారులతో నడుస్తోందని ధ్వజమెత్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు ఏం మొఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయమని అడుగుతారు. ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీ నా వంతుగా కృషి చేస్తూ పని చేశాను. కానీ నేడు జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుంది. ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కాంగ్రెస్‌కు విధేయతతో పనిచేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడం అన్యాయం. కాంగ్రెస్ పార్టీ జెండాను అవమానించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం.. ఎన్ని విధాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేశారో నాకు తెలుసు...


నా ఒక్కదానికే కాదు ఎంతో మందికి, సీనియర్‌లకు కూడా అన్యాయం చేసి పారాషుట్‌లకు టికెట్‌లు ఇచ్చారు. గాడిదను గుర్రం అనుకుని తీసుకొని వచ్చాం.. పార్టీలో చేరకముందే వారి పేర్లు లిస్ట్‌లో ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న వారికి అన్యాయం. పార్టీ జెండా మోసిన వ్యక్తి ని విడిచిపెట్టి ఎవరో అనామకునికి టికెట్ ఇచ్చారు. 24 గంటల్లో పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం..? కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ది అన్నట్లు గా బెహేవ్ చేస్తున్నారు.


ఎన్ని ఇబ్బందులు వచ్చినా గతంలో పార్టీని వీడలేదు ఇప్పుడు తప్పనిసరిగా వెళ్తున్నాను. సోనియా గాంధీకి రాజీనామాను పంపించాను. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఒక్కటే ప్రజలకు న్యాయం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న మూడు పార్టీలో  బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉందని నాకు అనిపించింది." అని పాల్వాయి స్రవంతి మీడియా సమావేశంలో మాట్లాడారు.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook