దుబ్బాక మగిసింది. దేశంలో ఉప ఎన్నికలు, బీహార్ ఎన్నికలూ ముగిశాయి. ఇప్పుడందరి  దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన వెలువరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశంలో బీహార్ ఎన్నికలు ( Bihar Elections ), ఇతర ఉప ఎన్నికల ( Bypolls ) తరువాత ఇప్పుడందరి దృష్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపైనే పడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ( Greater Hyderabad Elections ) నగారాను ఇవాళే ఎన్నికల కమీషన్ మోగించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించింది. డిసెంబర్‌ 1న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు. రీ పోలింగ్ అవసరమైతే..డిసెంబర్ 3న నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌ 6 లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని  చెప్పారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. నామినేషన్లు ఈ నెల 18 నుంచి ప్రారంభమై...20న ముగియనున్నాయి. స్క్రూటినీ నవంబర్ 21న జరగనుంది. ఉపసంహరణకు ఆఖరు తేదీ నవంబర్ 22. 


దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదున్న బీజేపీ ( BJP ) గ్రేటర్ మాదేనంటూ ధీమా వ్యక్తం చేసింది. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీలు ( TRS - MIM ) మరోసారి జీహెచ్ఎంసీ ( GHMC ) పగ్గాలు చేపట్టేందుకు సిద్దమయ్యాయి.  ఈ నేపధ్యంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన ( Janasena ) గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమైంది. కార్యకర్తలు, అందరి విజ్ఞప్తి మేరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఓ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


నగర పరిధిలోని పార్టీ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు చర్చించుకుని పోటీ విషయాన్ని ప్రతిపాదించినట్టు జనసేన పార్టీ తెలిపింది. తెలంగాణతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయని..అందరి వినతి మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.



జీహెచ్‌ఎంసీ ( GHMC ) లోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయని..ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. అందరి అభీష్టానికి అనుగుణంగా జనసేన అభ్యర్ధుల్ని బరిలో నిలపనుందని చెప్పారు. ఏపీలో బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పని చేస్తున్న నేపధ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీకు నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా బీజేపీతో కలిసి బరిలో నిలుస్తుందా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. Also read: AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గదు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్