AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గదు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు. 

Last Updated : Nov 17, 2020, 04:39 PM IST
  • పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
  • టీడీపీ నేతలకు దీటైన సమాధానం, చెమ్మచెక్క ఆడుతున్నావా అని దేవినేనిపై ధ్వజం
  • 2021 డిసెంబర్ నాటికి..అంగుళం కూడా తగ్గకుండా నిర్మాణం పూర్తి
AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గదు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు.  

పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) ఇటీవలి కాలంలో చర్చనీయాంశమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్షం టీడీపీ తరచూ ఆరోపణలు చేస్తోంది. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ( Ap Irrigation minister Anil kumar yadav ) తీవ్రంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..కాపర్ డ్యాం పనుల్ని ( polavaram copper dam works ) పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత ఎత్తులో అంగుళం కూడా తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 194 టీఎంసీల సామర్ధ్యం ప్రకారం కచ్చితంగా నిర్మిస్తామని...2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది...వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాగా..పూర్తి చేసేది వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) అని మంత్రి చెప్పారు. 2022 ఖరీఫ్ కు పోలవరం నీళ్లందిస్తామని కూడా స్పష్టం చేశారు. 

పోలవరం ఎత్తు ( Polavaram Height ) విషయంలో ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్న టీడీపీ ( TDP ) నేతలకు దీటైన సమాధానమిచ్చారు. అనుమానముంటే టీడీపీ నేతలు పోలవరం వచ్చి ..ఎత్తు కొల్చుకోవచ్చని తెలిపారు. అనవసరమైన ప్రచారాలు మాని..ధైర్యముంటే 2017 కేంద్ర కేబినెట్ లోని ఏయే అంశాలకు ఆమోదం తెలిపారో వచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. మంత్రిగా ఉన్నప్పుడు చెమ్మ చెక్క ఆడుతున్నావా అంటూ టీడీపీ నేత దేవినేని ఉమపై విరుచుకుపడ్డారు. ఇతరుల గురించి మాట్లాడేే ముందు సొంత జిల్లాలో మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి..2017లో కేంద్రం చెప్పిన అన్ని అంశాల్ని ఒప్పుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. 

అసలు పోలవరం ఆర్ అండ్ ఆర్ ( Polavaram R & R ) , పునరావాసం గురించి మాట్లాడే అర్హత టీడీపీకు లేదని చెప్పారు. 50 వేల కోట్లలో 30 వేల కోట్లున్న ఆర్ అండ్ ఆర్ గురించి పట్టించుకోని టీడీపీ...70 శాతం పూర్తి చేశామని ఎలా చెబుతారన్నారు. కేవలం గ్రావిటీ ద్వారానే విశాఖకు నీళ్లు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో పైపులైన్ వేయదల్చుకున్నామని చెప్పారు. వాస్తవానికి దేవినేని ఉమ ( Devineni Uma )కు గానీ..చంద్రబాబు ( Chandrababu naidu )కు గానీ నిబంధనలు పూర్తిగా తెలియవని మండి పడ్డారు. తొలి యేడాది ఎవరూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయరని..సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం రేట్ ఆఫ్ ఫిల్లింగ్, హై టాప్ ఫిల్లింగ్ అనేవి ఉంటాయని మంత్రి చెప్పారు. వన్ థర్డ్, టూ థర్డ్ అంటూ నీటి నిల్వను పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు. Also read: AP: రైతుల కోసం మరో పధకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్

Trending News