Varahi Vehicle Registration జన సేనాని పవన్ కళ్యాణ్‌ ఎన్నికల వాహనం వారాహి మీద ఎంతటి కాంట్రవర్సీ నెలకొందో అందరికీ తెలిసిందే. వాహన రంగు మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక వారాహికి రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. వాటిపై తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు క్లారిటీ ఇచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి లైన్ క్లియర్ అయింది. వాహనానికి రవాణా శాఖ అన్ని అనుమతులు ఉన్నాయని, వారం క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలిపాడు. వాహన బాడీకి సంబంధించినసర్టిఫికెట్ పరిశీలించామని పేర్కొన్నాడు. ఇక ఈ వాహనానికి TS13EX 8384 అనే నంబర్‌ను రవాణా శాఖ ఇచ్చింది. దీంతో వారాహికి అన్ని పరిమితులు వచ్చేశాయి.


ఇక రాబోవు ఎన్నికల్లో ఏపీలో జన సేనాని ఈ వాహనం మీద రాష్ట్రం అంతటా కూడా పర్యటించబోతోన్నాడు. లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం, ఉండాల్సిన ఎత్తు కంటే ఎక్కువ ఉండటం, మైన్స్‌లో వాడాల్సిన వాహనాల టైర్లను రోడ్డుపై వెళ్లే వాహనానికి ఉపయోగించారని, ఆర్మీకి సంబంధించిన కలర్‌ను వాడారంటూ ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకమని.. అందుకే రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందనే గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


Also Read : Upasana Konidela Pregnancy : తండ్రి కాబోతోన్న రామ్ చరణ్‌.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్


Also Read : Vijay Devarakonda Father : విజయ్ దేవరకొండను మళ్లీ గెలికిన బండ్ల గణేష్.. నెటిజన్ల కామెంట్లు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook