DA HRA And Basic Payment: తెలంగాణ ఉద్యోగ వర్గాలు ఒక్కొక్కరుగా ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమవగా.. ఆర్టీసీ ఉద్యోగులు కూడా నిరసన బాట పట్టారు. తాజాగా విశ్వవిద్యాలయ ఉద్యోగులు కూడా ఉద్యమానికి సై అంటున్నారు. తమకు రావాల్సిన పెండింగ్‌ డియర్‌నెస్‌ అలవెన్స్‌, కనీస వేతనం అమలు, హెచ్‌ఆర్‌ఏ చెల్లింపులు, జీతాల పెరుగుదల వంటి సమస్యలపై ధర్నాకు దిగారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Reddy Women: తీన్మార్ మల్లన్నకు 'రెడ్డి మహిళల' షాక్.. నాలుక చీరేస్తామని హెచ్చరిక


అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు కనీస వేతనం, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన పే స్కేలును అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు ప్రొఫెసర్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎన్‌సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఓయూలో ఆందోళన
అనంతరం ఆర్ట్స్‌ కళాశాల వద్ద జరిగిన సమావేశంలో కాంట్రాక్టు అధ్యాపకులు సీమర్ల విజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో పని చేస్తున్న 1,400 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో కూడిన కనీస జీతం, డీఏ, హెచ్ఆర్ఏ తో కూడిన స్కేల్‌ కావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కోసం రెండు సంవత్సరాలుగా పోరాడుతున్న రేవంత్‌ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Chiranjeevi: ఇంతకీ చిరంజీవి కాంగ్రెస్ వైపా.. బీజేపీ వైపా? మెగాస్టార్‌ 'రాజకీయ సంచలనం'


కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి రేవంత్‌ రెడ్డి మభ్యపెట్టి మోసగించారని కాంట్రాక్ట్‌ అధ్యాపక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిందని.. కానీ 14 నెలలు అయినా కూడా రేవంత్‌ రెడ్డి ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌ చేశారు. బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్‌ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే విశ్వవిద్యాలయాలను అన్నింటిని షట్‌డౌన్ చేసి మరో తెలంగాణ ఉద్యమంలాగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.