Padi Kaushik Reddy: కలెక్టర్ మాదిరి రేవంత్ రెడ్డిని కూడా ఉరికించే పరిస్థితి వస్తది
People Will Punish To Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తప్పించుకు తిరుగుతున్న రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తదని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోష్యం చెప్పారు. దళిత బంధు డబ్బులు ఇచ్చేదాక తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
Dalit Bandhu: హుజురాబాద్ నియోజకవర్గంలో తన ప్రజలకు దళిత బంధు డబ్బులు ఇచ్చేదాక వదిలి పెట్టే ప్రసక్తే లేదని అక్కడి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు ఇస్తే రేవంత్ రెడ్డి దానిని ఎగ్గొడుతున్నాడని మండిపడ్డారు. 'దళిత మహిళలను బూటు కాలుతో పోలీసులు తన్నడమే కాదు ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నాపైన ప్రభుత్వం దాడి చేసింది' అని కౌశిక్ రెడ్డి వివరించారు.
Also Read: Kukatpally: రేవంత్ రెడ్డినే రమ్మంటూ సర్వే అధికారులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్లాస్
దళిత బంధు డబ్బులు ఇవ్వాలని కోరుతూ హుజురాబాద్‌లో ఆందోళన చేపట్టిన బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల దాడిలో తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన పరిణామాలను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ఇష్టం ఉన్నట్లు వ్యవహరించారని చెప్పారు. 'దళిత మహిళలను బూటు కాలుతో పోలీసులు తన్నారు. నాపైన ప్రభుత్వం దాడి చేసింది. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తా. దళితులకు రెండో విడత దళితబంధు ఇవ్వాల్సిందే. దళితులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వేషం ఎందుకు?' అని ప్రశ్నించారు.
Also Read: KTR: అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. కేటీఆర్ కన్నీటిపర్యంతం
అసలేం జరిగింది?
'కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు తెచ్చిన దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చారు. ఇంకా 5,000 కుటుంబాలకు రావాలి. డబ్బు ఖాతాల్లో ఉన్నా ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వాలని దళిత కుటుంబాలు కోరితే నేను అక్కడికి వెళ్లాను. అంతే అరెస్ట్ చేసి పోలీసులు దాడి చేశారు' అని వివరించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్‌లో దళితబంధు కోసం దళితులు కాంగ్రెస్ నేతలు వస్తే నిలదీయండి అని పిలుపునిచ్చారు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 'రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు తిరగబడి కలెక్టర్‌ను ఉరికించారు. దళితబంధు ఇవ్వకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి' అని హెచ్చరించారు. 'నా పోరాటం పోలీసులపై కాదు.. నా పోరాటం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపైన' అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. 'ప్రజలు రేవంత్ రెడ్డిని ఉరికించే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా? రేవంత్ రెడ్డి భాషను సరిదిద్దుకోవాలి' అని హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి