Madhavaram Krishna Rao: కుల గణన.. సమగ్ర సర్వే అంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే గందరగోళంతో కొనసాగుతోంది. సర్వేకు ఇంటికి వచ్చిన అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూనే.. వ్యక్తిగత వివరాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దీంతో సర్వే చేసేందుకు ఎన్యుమరేటర్లు జంకుతున్నారు. తాజాగా తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లను బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే నిలదీశారు. రేవంత్ రెడ్డినే రావాలని సర్వే అధికారులకు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read: KTR: అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. కేటీఆర్ కన్నీటిపర్యంతం
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఇంటింటి సర్వే కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లో మందకొడిగా సాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ పార్టీ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి సోమవారం అధికారులు వచ్చారు. సర్వే పత్రంలో ఉన్న వివరాలు.. ప్రశ్నలను ఎన్యుమరేటర్లు ఎమ్మెల్యేకు వివరించారు. వ్యక్తిగత వివరాలు కూడా కోరడంతో ఎమ్మెల్యే కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Harish Rao: మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్ధాలు.. గాలి మోటార్లలో మంత్రుల చక్కర్లు
నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గుర్తు చేశారు. ఈ సందర్భంగా నాడు సర్వేను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి 'ఇప్పుడు ఏ ముఖంతో రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారు' అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు అని మండిపడ్డారు.
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిలదీశారు. గడువులోపు సర్వే పూర్తీ చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, బడుగు బలహీనర్గాలతో పాటు మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వేతో ప్రయోజనం దక్కాలని కోరారు. ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు ఎమ్మెల్యే సూచించారు. మొదట ప్రజాప్రతినిధుల వివరాలు సేకరిచే కంటే ప్రజల వివరాలు సేకరించాలని చెప్పారు. ప్రజలకు సర్వే పేరిట అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి