Jubilee Hills One Drive Food Court: స్పై కెమెరా..ఇది ఒక్కటీ చాలు మీ జీవితాన్ని నడిబజారులో పెట్టేయడానికి..! కొందరు నీచులు ఈ కెమెరాలను షాపింగ్ మాల్స్ లోనూ, కార్యాలయాల్లోనూ, హోటల్స్ లోనూ,  బాత్రూమ్ లోనూ పెట్టి...మహిళలు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేసి..అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ హిడెన్  కెమెరా పెన్, బటన్, ఛార్జర్, బల్బు, మెుబైల్ ఇలా ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఇది ఎక్కడో దాగి ఉందో గుర్తించడం చాలా కష్టం. తాజాగా హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లీహిల్స్ ‘వన్ డ్రైవ్’ రెస్టారెంట్ (One Drive Restaurant) బాత్రూంలో స్పై కెమెరా ఉదంతం వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Miracle: వీర్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి..యూట్యూబ్ చూసి.. బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌..!


వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌(jubilee hills)లో వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టు ఉంది. నల్లగొండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ (18) ఓ హోటల్‌లో ఆరు నెలల నుంచి హౌస్‌ కీపింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మూడురోజుల క్రితం తన సెల్‌ఫోన్‌ వీడియో కెమెరా(Mobile Video Camera) ఆన్‌ చేసి హోటల్లో మహిళలు ఉపయోగించే టాయిలెట్‌లో పైన పెట్టాడు. దానిలో రికార్డైన వీడియోలు ప్రతిరోజూ చూస్తుండేవాడు. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోంది. అయితే బుధవారం ఓ యువతి ఆ సెల్‌ఫోన్‌ను గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు.


సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. సుమారు 20 మంది మహిళల వీడియోలు(Videos) ఫోన్లో చిత్రీకరించినట్లుగా గుర్తించారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడురోజుల నుంచే ఈ తతంగం నడుస్తోందా? ఇంతకు ముందు కూడా ఏమైనా వీడియోలు తీశాడా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook