మినిస్టర్ సార్.. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి.. కేటీఆర్‌కు యువ రైతు లేఖ..
Nalgonda farmer letter to KTR: బీటెక్ చదివిన తాను వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని.. పల్లె ప్రకృతి వనం పేరుతో ఆ భూమిని అధికారులు తీసుకున్నారని ఆ యువ రైతు లేఖలో వాపోయాడు.
Nalgonda farmer letter to KTR: నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు తన ఆత్మహత్యకు అనుమతినివ్వాలంటూ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు. తనకున్న కొద్దిపాటి భూమిని పల్లె ప్రకృతి వనం పేరిట అధికారులు స్వాధీనం చేసుకున్నారని లేఖలో వాపోయాడు. ఉన్న జీవనాధారాన్ని కోల్పోవడంతో ఇక తనకు చావే శరణ్యమని... తాను చనిపోయేందుకు అనుమతినివ్వాలని మంత్రిని కోరాడు. జిల్లాలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు ఈ లేఖ రాశాడు.
బీటెక్ చదివిన తాను వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని శ్రీను (Telangana Farmer) లేఖలో పేర్కొన్నాడు. తనకు ఎలాంటి ఉద్యోగం లేదని పేర్కొన్నాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాను ఉన్న భూమిని పల్లె ప్రకృతి వనం పేరుతో అధికారులు తీసుకోవడంతో రోడ్డున పడ్డానని తెలిపాడు. గతంలో కొంత భూమిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం అధికారులు తీసుకున్నారని పేర్కొన్నాడు. తన జీవితం దుర్భరంగా మారిందని.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తన సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చొప్పరి శ్రీను మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు (Palle Prakruthi Vanam), వైకుంఠ ధామాలు, హరిత హారం పేరిట గ్రామాల్లోని పేదల భూములను లాక్కుందనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భూములు కోల్పోయినవారు కలెక్టరేట్ల ఎదుట నిరసనకు దిగుతున్నారు. తమ భూములను తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాక కొన్ని కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. పట్టా భూములు కొన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చబడ్డాయి. కొన్ని పట్టా భూములు అసలు అసలు పోర్టల్‌లో చేర్చనే లేదు. దీంతో ఆ భూముల రైతులు (Tealngana Farmers) సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు, రైతు భీమా అందక.. అవసరానికి భూములు అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ భూములను ధరణి పోర్టల్‌లో చేర్చాలని నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
Also Read: నోట్లో గుడ్డలు కుక్కి, పెదాలు కొరికేసి.. 11 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం
Also Read : Rains in Telangana: వెదర్ అలర్ట్.. తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook