CPI Narayana on PM Modi: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం నేడు హైదరాబాద్ విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలన్నీ ముప్పేట దాడి మొదలుపెట్టాయి. 'సాలు దొర సెలవు దొర' అంటూ టీఆర్ఎస్‌ను బీజేపీ టార్గెట్ చేస్తే.. 'సాలు మోదీ.. సంపకు మోదీ.. బైబై మోదీ' అంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడీ స్లోగన్లతో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారంటూ అటు కాంగ్రెస్ కూడా మోదీని నిలదీస్తోంది. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కూడా మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు గురించి ప్రస్తావించిన నారాయణ.. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. ఇలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీ తమకు ఫెడరల్ స్పూర్తి అంటే ఇష్టం లేదని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.40 లక్షల కోట్లుగా ఉన్న అప్పు మోదీ హయాంలో రూ.85 లక్షల కోట్లకు వెళ్లిందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక 25 మంది బడా బాబులు రూ.25 లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని పేర్కొన్నారు. వీటికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.


ప్రధాని నరేంద్ర మోదీ తన మేకప్ కోసమే నెలకు రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ ప్రాధాని ఇలా చేయలేదన్నారు. మోదీ పేరుకు తాను సన్యాసినని చెప్పుకుంటూ విలాసాలు,అలంకరణలకు లక్షల రూపాయాలు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. 


కాగా, ప్రధాని నరేంద్ర మోదీ తన మేకప్‌ కోసం రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారంటూ గతంలో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి. మోదీకి ఓ యువతి మేకప్ అద్దుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటో తెగ వైరల్ అయింది. అయితే ఇందులో వాస్తవం లేదని ఆ తర్వాత తేలింది. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్‌లో మోదీ మైనపు విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఆయన కొలతలు తీసుకునేందుకు 2016లో ఓ టీమ్ ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చింది. ఆ సందర్భంగా తీసిన ఫోటోలో ఉన్న యువతిని మేకప్ ఆర్టిస్టుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. 



Also Read: Hero Vishal: కుప్పంలో పోటీపై తేల్చేసిన విశాల్.. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు..


Also Read: Traffic Alert: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ రెండు రోజులు అటు వైపు వెళ్లకండి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook