Hyderabad Traffic Diversions: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు, మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులుంటాయని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నగరంలో రేపు ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఎలా ఉందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపు అంటే జూలై 3న సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాటైంది. మోదీ బహిరంగ సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. రేపు మద్యాహ్నం 2 గంటల్నించి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులుంటాయని నగర కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యంగా HICC మాదాపురం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రాజ్‌భవన్, పంజాగుట్ట, బేగంపేట ఎయిర్‌పోర్ట్, పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణాలు మానుకోవాలని కమీషనర్ సూచించారు. అదే విధంగా టివోలి క్రాస్‌రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్స్ వరకు రోడ్డు మూసివేయనున్నారు. 


రేపు నగరంలో ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలివే


చిలకలగూడ క్రాస్‌రోడ్, సంగీత్ రోడ్, ప్యాట్నీ క్రాస్‌రోడ్, ప్లాజా క్రాస్‌రోడ్, సికింద్రాబాద్ క్లబ్, డైమండ్ పాయింట్, బోయినపల్లి క్రాస్‌రోడ్, రసూల్ పురా, బేగంపేట్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్ వైఎంసీఏ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించాలనుకునే వాళ్లు..ముందుగా బయలుదేరడమే కాకుండా ప్లాట్‌ఫామ్ నెంబర్ 10 నుంచి చేరుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. 


రేపు ట్రాఫిక్ మళ్లింపులు ఇలా


పంజాగుట్ట నుంచి సికింద్రబాద్ రైల్వే స్టేషన్ చేరుకునేవారు పంజాగుట్ట వివి విగ్రహం నుంచి ఐమ్యాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ముషీరాబాద్ క్రాస్‌రోడ్, గాంధీ ఆసుపత్రి మార్గం ద్వారా చేరుకోవాలి. ఇక ఉప్పల్ నుంచి తార్నాక మీదుగా ఆలుగడ్డ బావి, చిలకలగూడ క్రాస్‌రోడ్ మీదుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కరీంనగర్ హైవే నుంచి రెండువైపులా..అవుటర్ రింగ్ రోడ్ షామీర్‌పేట్ గేట్ నెంబర్ 7 నుంచి ప్రవేశించవచ్చు. అమీర్‌పేట్ వైపు వెళ్లాల్సినవారు మేడ్చల్ ఓఆర్ఆర్ గేట్, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాలి. ఉప్పల్ వైపు వెళ్లాలనుకుంటే..కీసర ఓఆర్ఆర్ గేట్, కుషాయిగూడ ఈసీఐఎల్, మౌలాలీ, నాచారం మీదుగా వెళ్లాలి. ఇక కరీంనగర్ నుంచి వచ్చేవాళ్లు..తిరుమలగిరి క్రాస్‌రోడ్, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్, మాలాలీ, తార్నాక మీదుగా నగరంలో రావచ్చు.


కరీంగర్ వెళ్లేందుకు లేదా కరీంనగర్ నుంచి వచ్చేందుకు తిరుమలగిరి క్రాస్‌రోడ్, జేబీఎస్ మార్గం వద్దని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా గచ్చిబౌలి, పఠాన్ చెరువు, మేడ్చల్, కీసర, ఘట్‌కేసర్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఉప్పల్ నుంచి పంజాగుట్ట వెళ్లేందుకు రామంతపూర్, అంబర్ పేట్, హిమాయత్ నగర్, వీవీ విగ్రహం ద్వారా వెళ్లాలి. తార్నాక లేదా మెట్టుగూడ నుంచి పంజాగుట్ట-అమీర్‌పేట్ వెళ్లేవారు..సంగీత్ క్రాస్‌రోడ్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్, ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్ మీదుగా వెళ్లాలి. 


ఇక బీజేపీ సికింద్రాబాద్ సభకు వచ్చే ప్రజలు పార్కింగ్ స్థలాల కోసం పోలీసులు రూట్‌మ్యాప్ విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభ నేపధ్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో రోడ్లన్నీ రద్దీగా ఉంటాయని పోలీసులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకుంటే మంచిదని సూచించారు. 


Also read: Jaggareddy on Revanth: కాంగ్రెస్‌లో చిచ్చురేపిన యశ్వంత్ సిన్హా రాక..రేవంత్‌పై జగ్గారెడ్డి ధ్వజం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook