Police Seize one crore above value ganja inKowkur Jawahar Nagar Hyderabad: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌ కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. మల్కాజిగిరి పరిధిలో ఉన్న కౌకుర్‌ (Kowkur) దర్గా వద్ద రెండు బైక్‌లపై తరలిస్తున్న 450 కిలోలకు పైగా ఉన్న గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు (Excise‌ police) స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.కోటికిపైగా (one crore above) ఉంటుందని అంచనా వేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ తెలిపారు. మహ్మద్‌ ఫరీద్‌, ఇస్మాయిల్‌, సచిన్‌ చవాన్‌, బస్వరాజును అరెస్టు చేసినట్లు చెప్పారు. గంజాయి తరలిస్తున్న రెండు కార్లను సీజ్‌ చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా నుంచి గంజాయిని (ganja) మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రవికాంత్‌ వివరించారు.


Also Read : Cheating Women: ఎన్నారైనంటూ సహజీవనం చేస్తూ నగలు ఎత్తుకెళ్తోన్న కేటుగాడు


ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి తోటల్ని ధ్వసం చేసే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ ఏజెన్సీలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) జాయింట్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగాయి. 239 ఎకరాల్లో (239 acres) గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది సమీపంలో 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతోన్న గంజాయి తోటలను ఎస్‌ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు.


చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్‌ డూడి ఆ గ్రామాన్ని సందర్శించి 15 ఎకరాల్లో ఉన్న గంజాయి (ganja) తోటలకు నిప్పంటించారు.


Also Read : Chandra Grahanam 2021:నవంబర్ 19న కార్తీక పౌర్ణమి..ఆ రోజే చంద్ర గ్రహణం..ఆ రాశిపై


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook