Polytechnic Question Paper Leak in Telangana: తెలంగాణలో ప్రస్తుతం పాలిటెక్నిక్ పరీక్షలు జరగుతున్నాయి. ఇటీవల ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షలు సజావుగా కొనసాగుతున్న క్రమంలో ఇప్పడు క్వశ్చన్ పేపర్స్ లీక్‌ అంశం తెరపైకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలిటెక్నిక్ ఫైన‌లియ‌ర్ క్వ‌శ్చ‌న్ పేపర్స్... ఎగ్జామ్‌ కంటే ముందే లీక్ అయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే పాలిటెక్నిక్ ఫైన‌లియ‌ర్‌‌కు సంబంధించి క్వ‌శ్చ‌న్ పేపర్స్ ముందే లీక్ అయిన‌ట్లుగా గుర్తించిన ఇతర జిల్లా కాలేజీల ప్రిన్సిపాల్స్ బోర్డ్‌కు సమాచారం అందించారు.


హైదరాబాద్‌లోని హ‌య‌త్‌న‌గ‌ర్ బాట‌సింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కాలేజీ నుంచి ఎగ్జామ్స్‌ కంటే ముందుగానే పాలిటెక్నిక్ ఫైన‌లియ‌ర్ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లుగా తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ గుర్తించింది. 


స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కాలేజీ నుంచి ప్రశ్నాపత్రాలను వాట్సాప్‌లో స్టూడెంట్స్‌కు పంపిచినట్లుగా... విద్యాశాఖాధికారులు గుర్తించారు. క్వ‌శ్చ‌న్ పేపర్స్ లీక్‌పై ఇప్పటికే తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ బోర్డ్‌ సెక్రటరీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.


దీంతో స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజీపై కేసు ఫైల్ అయింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రశ్నాపత్రాలు ముందుగానే ఎలా లీక్‌ అయ్యాయి... ఇందుకు ఎవరు సహకారం అందించారు.. వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్స్ ముందే చక్కర్లు కొట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది.


Also Read: IND vs WI: టీమిండియాదే బ్యాటింగ్.. రాహుల్, చహల్ ఔట్! మూడు మార్పులతో బరిలోకి భారత్!!


Also Read: AP New Districts: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook