Corona Third wave: తెలంగాణలో మగిసిన కొవిడ్ థార్డ్​వేవ్​- డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటన!

Corona Third wave: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతోంది. ఇదే విషయంపై డీహెచ్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో థార్డ్​వేవ్​ ముగిసిందన్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 03:07 PM IST
  • రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం
  • తాజా పరిస్థితులపై డీహెచ్ కీలక ప్రకటన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం
Corona Third wave: తెలంగాణలో మగిసిన కొవిడ్ థార్డ్​వేవ్​- డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటన!

Corona Third wave: తెలంగాణ కరోనా థార్డ్​వేవ్​ ప్రభావంపై కీలక ప్రకటన చేశారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్​ హెల్త్ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాస రావు. రాష్ట్రంలో కరోనా మూడో దశ దాదాపు ముగిసినట్లేనని తాజాగా ప్రకటించారు. తాజాగ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

గత నెల 23 నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగినట్లు డీహెచ్ వెల్లడించారు. మరుసటి రోజు (జనవరి 24న) అత్యధికంగా 4,800 కరోనా కేసులు నమోదైనట్లు చెప్పారు.

స్వల్పకాలంలోనే కేసులు తిరిగి తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపారు డీహెచ్​. కరోనా ఉద్ధృతి పీక్ స్టేజీకి వెళ్లినప్పుడు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి చేరిందని వెల్లడించారు​. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఈ గణాంకాల ఆధారంగా రాష్ట్రంలో కొవిడ్ థార్డ్​ వేవ్​ ముగిసినట్లేనని తెలిపారు.

కొవిడ్ మొదటి దశ అత్యధికంగా 10 నెలలు ఉంటే.. రెండో దశ ఆరు నెలలు ఉన్నట్లు గుర్తు చేశారు. ఇక మూడో దశ 28 రోజుల్లోనే ముగిసినట్లు వివరించారు.

నిబంధనలు పాటించాల్సిందే..

రాష్ట్రంలో కరోనా థార్డ్​వేవ్​ ముగిసినప్పటికీ అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు డీహెచ్ శ్రీనివాసరావు. ముఖ్యంగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పరిస్థితులు..

రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 నుంచి సోమవారం సాయంత్రం 5.30 వరకు 1,380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో రికవరీ రేటు 96.39 శాతానికి పెకరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 24 వేల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ రోజు కొవిడ్ కేసుల వివరాలు వెలువడితే ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశముంది.

Also read: Amit Shah: నేడు ముచ్చింతల్‌కు అమిత్ షా.. సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు...

Also read: Medaram Jatara: నేరుగా ఇంటి వద్దకే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News