హైదరాబాద్: పండగ అనగానే పిల్లలతో పాటు పెద్దలకు గుర్తొచ్చేది సెలవులు. తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సంక్రాంతి సెలవురోజులు ప్రకటించేశారు. మరో మూడు రోజుల్లో సంక్రాంతి సెలువులు ప్రారంభం కానున్నాయి. అయితే ఏపీతో పోల్చితే సెలవు రోజులు సగం మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో సంక్రాంతి సెలవు దినాలను 6 రోజులకే పరిమితం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి. తిరిగి జనవరి 17న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబంధనలను అతిక్రమించి సంక్రాంతి సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహించే విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు 10 రోజుల సంక్రాంతి సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు.. జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 19వరకు అక్కడ సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. స్కూళ్లు 21న, జూనియర్ కాలేజీలకు 22న తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. 


Also Read: ఏపీలో సంక్రాంతి సెలవులు ఇవే.. విద్యార్థులకు పండగే!


తమకు కూడా ఏపీ మాదిరిగానే 10రోజులపాటు సెలవులు కావాలని విద్యార్థులకు భావిస్తుండగా, విద్యాశాఖ అందుకు సముఖంగా లేదు. దసరా సమయంలో ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి సెలవులు సైతం పొడిగిస్తే సిలబస్ పెండింగ్‌లో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..