Ponguleti Srinivas Reddy's Delhi Visit: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో కొత్తేం ఉంది అని అనుకోకండి. ఎప్పుడూ వ్యాపార పనులపై వెళ్లడం వేరు.. ఈసారి తన రాజకీయ పనులపై వెళ్లడం వేరు అంటున్నాయి పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయవర్గాలు. తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో నూతన పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీతో విభేదాలు పెరిగి ఆ పార్టీకి దూరమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తున్న బీజేపి.. అందుకోసం ఖమ్మం జిల్లాలో జన బలం కలిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేజారిపోకుండా ఒడిసి పట్టుకోవాలని చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపి అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అధిష్టానం ఆహ్వానం మేరకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టు ఓ ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఈ అంశంపై ఢిల్లీ నుంచే ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుదారులు చెబుతున్నారు. 


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం బీజేపి మాటలకు ట్యూన్ అవుతున్నట్టు టాక్ నడుస్తోంది. మరి బీజేపి హై కమాండ్ చెప్పినట్టుగా విని సొంత పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా లేక బయటి నుంచే మద్దతు ఇస్తానని చెబుతారా ? ఇది కూడా కాకుంటే అసలు బీజేపితో తనకు సంబంధం లేదని చెబుతారా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.


ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్


ఇది కూడా చదవండి : MLA Etela Rajender: నిమ్మకునీరు ఎత్తినట్లు కేసీఆర్ తీరు.. ప్రీతిది వ్యవస్థ చేసిన హత్య: ఈటల రాజేందర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook