Ponguleti Srinivas Reddy: దీపావళి ముందు రాజకీయ బాంబులు అని చెప్పి అభాసుపాలైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. ఈసారి తెలంగాణకు రాజధాని విషయంలో కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌ రాజధానిగా ఉండగా.. రెండో రాజధానిగా వరంగల్‌ను చేస్తామని ప్రకటించారు. ఆ విధంగా వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తామని పొంగులేటి తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Padayatra: ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్‌.. పాదయాత్ర చేసేది అక్కడి నుంచే!


వరంగల్‌ జిల్లాలో ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ప్రఖ్యాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. 'తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి  పరుస్తాం' అని తెలిపారు.


Also Read: Arvind: త్వరలో రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కి పడేస్తారు


వరంగల్‌లో ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయించి కబ్జా నిర్మాణాలను తొలగిస్తామన్నారు. కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.


కాగా అధికార కాంగ్రెస్‌ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన దూకుడు వ్యవహారంపై ఒరిజినల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. అతడి వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పొంగులేటిని నియంత్రించాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీపావళి రాజకీయ బాంబులు పేలుతాయని చెప్పి అభాసుపాలవడంతో సొంత పార్టీ నాయకులే అతడి వ్యవహారంపై గుర్రుమంటున్నారు. ప్రస్తుతం నిలకడగా ఉన్న పొంగులేటి భవిష్యత్‌లో మాత్రం కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.