ప్రణయ్ హత్యకేసు: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్య వైశ్య భవన్‌లో మారుతీ రావు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి భవన్‌లో బస చేసిన మారుతీ రావు ఆదివారం ఉదయం ఆయన భార్య ఫోన్ కాల్‌కు స్పందించలేదు.
See Pics: బాలీవుడ్ బ్యూటీతో బైక్‌పై విజయ్ చక్కర్లు
అనుమానం వచ్చి ఆయన భార్య భవన్ సిబ్బందిని అలర్ట్ చేశారు. వారు వచ్చి డోర్ ఎంతకొట్టినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా మారుతీరావు విగతజీవిగా పడి ఉన్నాడు. విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడినట్లుగా గుర్తించి ఆర్యవైశ్య భవన్ సిబ్బంది, యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మారుతీరావు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
తండ్రి ఆత్మహత్యపై అమృత రియాక్షన్ ఇలా ఉందా!
కాగా, రెండేళ్ల క్రితం కూతురు అమృత, ప్రణయ్‌ని ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో అల్లుడిని కిరాతకంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య సంచలనం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు పీడీ యాక్ట్ కేసులో జైలుశిక్ష అనుభవించి 6 నెలల కిందట జైలు నుంచి విడులయ్యాడు.
Also Read: దక్షిణాదిన ఒకే‘ఒక్కడు’ మహేష్ బాబు
అప్పటినుంచీ ఈ కేసులో వెనక్కి తగ్గాలని కూతురు అమృతకు సూచించగా అందుకు ఆమె నిరాకరించింది. తనకు అనుకూలమైన సాక్ష్యం చెబితే ఆస్తిలో భారీ మొత్తం ఆమె పేరిట రాస్తానని సైతం అమృతను బుజ్జగించే యత్నం చేసినా లాభం లేకపోయింది. దీంతో మారుతీరావు ఆమెపై బెదిరింపులకు సైతం దిగాడు. ఓవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందని క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం, మరోవైపు కేసు నుంచి బయటకు రాలేకపోతున్నానన్న బాధతో కుంటిపోయిన మారుతీరావు బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..