Telangana news: కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో ఉద్యోగ నియామకాలకు 95శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తించనున్నట్లు రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల (Presidential order) ప్రకారం... ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వరకు 95శాతం స్థానికులకు జాబ్స్ లభిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విధంగా..అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లోనూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని కేసీఆర్ సర్కారు స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ (CS Somesh Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుని..ఈనెల 23 వరకు సాధాన పరిపాలనశాఖకు నివేదిక పంపాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 


Also Read: chinni krishna: తనపై దాడి చేశారంటూ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సినీ రచయిత చిన్ని కృష్ణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook