PUJARULA FIGHT: లంచాల కోసం ఉద్యోగులు గొడవ పడుతుండటం కామన్ గా జరుతుంటాయి. ఒకరిపై ఒకరు ఆసూయతో ఏసీబీకి పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కమీషన్లలో వాటాల కోసం రాజకీయ నాయకులు రోడ్డెక్కి రచ్చ చేస్తుంటారు. కాని భక్తులు ఇచ్చే దక్షిణ కోసం పూజారులు గొడవకు దిగారు. కొట్టుకున్నారు. దక్షిణ డబ్బుల పంపకాల్లో గొడలతో ఓ పూజారి.. తోటి పూజారిపై దాడి చేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మేళ్లచెరువు శివాలయ ప్రధాన అర్చకుడు విష్ణువర్ధన్ శర్మ ఆదేశాల మేరకు నరసింహ అనే తాత్కాలిక పూజారి వాహన పూజ నిర్వహించారు. పూజానంతరం భక్తులు ఆయనకు దక్షిణ సమర్పించారు. వాహన పూజ చేసిన సందర్భంగా తీసుకున్న దక్షిణ తనకూ ఇవ్వాలని అమ్మవారి ఆలయ జూనియర్ ధనుంజయ శర్మ... నరసింహను అడిగాడు. దీంతో ప్రధాన అర్చకుడిని అడిగి ఆ డబ్బులు ఇస్తాను తాత్కాలిక పూజారి నరసింహ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


వాగ్వాదం జరుగుతున్న క్రమంలోనే ఆగ్రహంతో నరసింహ పై దాడికి పాల్పడ్డారు  ధనంజయ శర్మ. విచక్షణ రహితంగా చేయి చేసుకున్నారు. ఈ దాడిలో నరసింహకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆలయ అధికారులు సీరియస్ గా స్పందించారు. దాడికి పాల్పడ్డ పూజారికి మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారుల తీరుపై లో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఇచ్చే దక్షిణ కోసం కొట్టుకోవడంపై మండిపడుతున్నారు.


READ ALSO: JSSC Recruitment 2022: 12వ తరగతి ఉత్తీర్ణతతో ప్రభుత్వ ఉద్యోగం... దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే... పూర్తి వివరాలివే...


READ ALSO: Southwest Monsoon: భారత్‌ను పలకరించిన నైరుతి రాగం..త్వరలో భారీ వర్షాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook