PM Modi comments: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్‌ ముదురుతోంది. గతకొంతకాలంగా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ..సీఎం కేసీఆర్,టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను విస్మరించిందని ఫైర్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పట్టుదల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ అని ప్రధాని మోదీ చెప్పారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో విముక్తి కల్గుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. తాము పారిపోయే వాళ్లం కాదు..పోరాడే వాళ్లమని పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ నింపారు.


తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోందన్నారు ప్రధాని మోదీ. నిరంకుశ తెలంగాణలో ఆశయాలు నెరవేరటం లేదన్నారు. రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. కుటుంబపార్టీలను తరిమిస్తేనే..రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తానన్నారు.


అంతకముందు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. మొత్తంగా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వే టార్గెట్‌గా ప్రధాని మోదీ విమర్శలు సంధించారు. మోదీ టూర్‌తో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సమయంలో సీఎం లేకపోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.
 


Also read:Dry Fruits Eating Tips: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!


Also read:TDP Mahanadu: టీడీపీ పండుగకు సర్వం సిద్ధం..ఒంగోలు బాట పట్టిన తెలుగు తమ్ముళ్లు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి