PM Modi Tour: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఫిక్స్..రోడ్ షోలపై బీజేపీ నేతల స్కెచ్‌లు..!
PM Modi Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈక్రమంలో వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది.
PM Modi Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈక్రమంలో వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు పాల్గొన్నారు. ఇందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షణలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రధాని మోదీ టూర్ ఖరారు అయ్యింది.
జూలై 2న ప్రధాని మోదీ..హైదరాబాద్ రానున్నారు. 2న మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత రోడ్డుమార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లోనే మోదీ ఉండనున్నారు. రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రెండురోజులపాటు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ బిజీ బిజీగా గడపనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు.
పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. జూలై 4న జరిగే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు. జూలై 1న మధ్యాహ్నం మూడు గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భాగ్యనగరానికి రానున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌లో భారీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also read: Tea Addiction: టీ తాగడం మానుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
Also read: Telangana Govt: ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.