AP Govt: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..పే స్కేల్‌ ఫిక్స్ చేసిన ప్రభుత్వం..!

AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజాగా వారి పే స్కేల్‌ను ఫిక్స్‌ చేసింది ప్రభుత్వం. 

Written by - Alla Swamy | Last Updated : Jun 25, 2022, 01:46 PM IST
  • సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
  • పే స్కేల్‌ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
  • అధికారిక ప్రకటన
AP Govt: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..పే స్కేల్‌ ఫిక్స్ చేసిన ప్రభుత్వం..!

AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజాగా వారి పే స్కేల్‌ను ఫిక్స్‌ చేసింది ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ గ్రేడ్‌-5 ఉద్యోగులకు బేసిక్‌ పే రూ.23 వేల 120 నుంచి రూ.74 వేల 770గా నిర్ణయించారు. మిగతా ఉద్యోగులకు రూ.22 వేల 460 నుంచి రూ.72 వేల 810గా ఖరారు చేశారు. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలుకానుంది. ఆగష్టు నుంచి కొత్త జీతాలు అందిస్తారు. 

ఈబేసిక్‌కు డీఏ,హెచ్‌ఆర్‌ఏ కలిపితే ఒక్కో ఉద్యోగికి రూ.30 వేల వరకు జీతాలు అందే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను గుర్తించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మిగిలిన వారికి కూడా తొందరగా ప్రొబేషన్‌ కల్పించాలని కోరుతున్నారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు.

కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేసి..పోస్టులు కల్పించారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషన్‌ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. జూలై నెలకు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు ఉప ఎన్నికతో సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ ఆసల్యమైంది.

Also read:Amit sha :19 ఏళ్ల పాటు మోడీ నరకయాతన! తన ఆప్త మిత్రుడి బాధను చెప్పిన అమిత్ షా..

Also read:zeLiver Damage Signs: కాలేయం దెబ్బతినడానికి ముందు ఈ సమస్యలు వస్తాయి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News