తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేశారు. ఈ క్రమంలో కొండగల్ సభలో టీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ టీఆర్ఎస్ పార్టీకి సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అని ..ఇది కూడా ఆర్ఎస్ఎస్ లాగే బీజేపీకి అనుబంధ సంస్థ అని రాహుల్ ఎద్దేవ చేశారు.


గత నాలుగేళ్ల కాలంలో కేసీఆర్ ఏనాడు ఎన్డీయే సర్కార్ ను విమర్శించలేదని.. మోడీ ప్రభుత్వ అక్రమాలపై కేసీఆర్ అస్సలు మాట్లాడలేదని రాహుల్ ఆరోపించారు... దేశంలోని అతిపెద్ద కుంబోణమైన రాఫెల్ కుబంకోణం కేసీఆర్ స్పందించలేదు..అలాగే భూసేకరణ చట్టం విషయంలో మోడీకి వ్యతిరేంగా ఎప్పుడూ మాట్లాడలేదు..పైగా పలు బిల్లుల ఆమోదం విషయంలో మోడీ సర్కార్ కు టీఆర్ఎస్ ఎంపీలు బాసటగా నిలిచారని రాహుల్ ఆరోపించారు.పార్లమెంట్ సమావేశాల సమయంలో ఈ విషయాన్ని టీఆర్ఎస్ సభ్యులను అడిగితే కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా  తాము నడుసుకుంటున్నామని సమాధానం ఇచ్చారని  ఈ సందర్భంగా రాహుల్ వివరించారు.