Rahul Gandhi Warning: వరంగల్ బహిరంగ సభ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్... టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని ఖండించారు. టీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కలిసి ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ తో కలిసి పోదామని భావించే నేతలు తమకు అవసరం లేదన్నారు. కేసీఆర్ తో ఎవరైనా టచ్ లో ఉన్నారని తేలితే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనన్నారు రాహుల్ గాంధీ. రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉంది కాబట్టే.. మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయ బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. తెలంగాణలో అధికారం రాదని గ్రహించిన బీజేపీ.. కేసీఆర్ ద్వారా రిమోట్ కంట్రోల్ పాలన చేయాలని చూస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే కేసీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా స్పందించడం లేదని చెప్పారు. ఈడీ,సీబీఐ విచారణలు జరిపించడం లేదని రాహుల్ విమర్శించారు.


తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లో రాలేదని, ప్రజల పోరాటం వల్లే సాధ్యమైందన్నారు రాహుల్ గాంధీ. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని.. పార్టీకి నష్టం జరిగినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. గత ఎనిమిది ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ వచించారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా.. రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా.. తాను తలుచుకున్నదే చేస్తూ పోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు రాహుల్ గాంధీ.


ఛత్తీస్‌గఢ్‌ లో తాము అధికారంలోకి రాగానే..  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పారు రాహుల్ గాంధీ. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా 15 వేల రూపాయలు అందిస్తామన్నారు. 


READ ALSO: Warangal Declaration: కాంగ్రెస్‌ అధికారంలోకి 2 లక్షలు రుణమాఫీ చేస్తాం-రేవంత్ రెడ్డి


Nagaraju's Wife Ashreen Reaction: నాగరాజు పరువు హత్య, అశ్రీన్‌ ప్రశ్నలకు బదులేదీ..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Also Read: Central Bank Of India: 600 బ్రాంచ్‌లను క్లోజ్‌ చేయనున్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా..?


Also Read: Mystery Tree: సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యం..చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe