Warangal Declaration:కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తాం: రేవంత్ రెడ్డి

Warangal Declaration: హనుమకొండలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను వివరించారు. సభలో 13 అంశాలపై డిక్లరేషన్‌ను ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 09:06 PM IST
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ
  • ఇందిరమ్మ రైతు భరోసా-రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు
  • ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు
Warangal Declaration:కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తాం: రేవంత్ రెడ్డి

Warangal Declaration: హనుమకొండలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను వివరించారు. సభలో 13 అంశాలపై డిక్లరేషన్‌ను ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి.

1. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ

2. ఇందిరమ్మ రైతు భరోసా-రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు

3. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు

4. రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటాం, ధరలు ముందే నిర్ణయం

5. మూతబడిన చెరకు ఫ్యాక్టరీలను తెరిపిస్తాం, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం

6. మెరుగైన పంటల బీమాను తీసుకొస్తాం, రైతు కూలీలకు, భూమి లేని రైతులకు బీమా

7. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తాం

8. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు

9. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం..మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం

10. నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు..అమ్మే సంస్థలపై పీడీ యాక్ట్‌

11. పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తాం..చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం

12. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపర అధికారాలతో రైతు కమిషన్

13. వ్యవసాయాన్ని పండుగ చేసే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు పండించి అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొంటుందని ఎంపీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. పంటల బీమా పథకం అమలు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి సాగు నీరు అందిస్తామన్నారు.

Also Read: Central Bank Of India: 600 బ్రాంచ్‌లను క్లోజ్‌ చేయనున్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా..?

Also Read: Mystery Tree: సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యం..చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News