Rahul Gandhi Meeting: తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్ అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య చిచ్చు రాజేస్తోంది. వరంగల్ లో రాహుల్ సభకు ఎలాంటి సమస్యా లేకపోయినా..  ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ టూర్‌కు మాత్రం పర్మిషన్ లభించడం లేదు. తాజాగా ఓయూలో రాహుల్ టూర్‌పై కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 5,6 వ తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాహుల్‌టూర్‌కోసం కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 5 న రాహుల్‌తో వరంగల్ లో రైతుసంఘర్షణ సభ పేరుతో భారీ బహిరంగ సభ, మే 6 న పార్టీ నేతలతో సమావేశంతో పాటు ఓయూలో విద్యార్థులతో ముఖాముఖికోసం ప్లాన్‌చేశారు. దీనికోసం అవసరమైన వారిని కలుస్తూ పర్మిషన్లు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. వరంగల్ సభకు ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా.. ఓయూలో రాహుల్ టూర్‌ కు మాత్రం మొదట్నుంచి అధికారులు సహకరించడం లేదు. ఓయూ వీసీని స్వయంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసి రాహుల్ పర్యటనకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై వారం రోజులు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతూ వస్తోంది ఓయూ పాలకమండలి. తాజాగా ఓయూలో రాహుల్‌ టూర్‌కు పర్మిషన్ ఇవ్వడంలేదని స్పష్టంచేసింది.


ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. తెలంగాణ ఇచ్చిన రాహుల్‌గాంధీకి ఓయూలోకి ఎంట్రీ నిరాకరించడం దారుణమని ఫైరవుతోంది. అటు ప్రభుత్వం కావాలనే రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధంచేసేందుకు ప్రయత్నించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం వెలువడటంతో తదుపరి కార్యాచరణకు సిద్దమవుతున్నారు కాంగ్రెస్ నేతలు.


Also Read: Tarsame Singh Saini Aka Taz: ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ కన్నుమూత!


Also Read: Weight Gain Reasons: బరువు పెరగడాని అతిపెద్ద 4 కారణాలు, మీరు కూడా ఈ తప్పులు చేయోద్దు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook