Rain Alert In Telangana: తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విశ్లేషణ హెచ్చరికలు జారీ చేశారు.  బుధవారం ఉత్తర - దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారు ఆదేశించారు. రాష్ట్రంలో నేటి నుంచి భారీ గాలులు వీయనున్నాయి. కాబట్టి ఎలాంటి పంట నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత


రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడంతో పాటు.. ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో మధ్యహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు  41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పరిసర జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు  38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అయ్యే ఛాన్స్‌ ఉందని పేర్కొంది.


తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. గురవారం కూడా ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా ఉండలని, వీలేతే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకపోవడం చాలా మంచిదని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook