Rain Alert: ముంచుకొస్తున్న అల్పపీడనం..తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ..!
Rain Alert: తెలంగాణలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. రాగల మూడు రోజులపాటు వాతావరణ సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Rain Alert: తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. జైసల్మేర్, కోట, సాగర్, పెండ్రారోడ్, గుండా, బాలాసోర్, అగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతు పవన ద్రోణి కొనసాగుతోంది. నిన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటికి తోడు రాగల 24 గంటల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.
రుతు పవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం, అల్ప పీడనం ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకావశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు, తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి.
రాగల మూడురోజులపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నైరుతి రుతు పవనాల ఆగమనం తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని భారీ వర్షాలు పడనున్నాయి.
ఈనెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతు పవనాల ప్రభావంతో 40.42 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..ఇప్పటివరకు 74.28 సెంటీమీటర్ల వర్షం పడింది. సగటు సాధారణ వర్షపాతం కంటే 84 శాతం అధికంగా వానలు కురిశాయి. నైరుతి సీజన్ పూర్తయ్యే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఐతే ఇప్పటివరకు అంతకు మించి వర్షపాతం రికార్డు అయ్యింది. ఈనెలాఖరుకు రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఓ ప్రకటనలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Also read:CM KCR LIVE UPDATES: అసెంబ్లీ రద్దా? జాతీయ పార్టీ ప్రకటనా? సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..
Also read:Minister KTR: నేతన్నలకు నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండి..గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook