Minister KTR: నేతన్నలకు నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండి..గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం..!

Minister KTR: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 

Written by - Alla Swamy | Last Updated : Aug 6, 2022, 02:13 PM IST
  • బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
  • మోదీ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఫైర్
  • తాజాగా లేఖాస్త్రం
Minister KTR: నేతన్నలకు నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండి..గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం..!

Minister KTR: కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఉపాధి పొందుతున్న టెక్స్‌టైల్స్ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. చేనేతపై జీఎస్టీ వేయడం ఏంటన్నారు. ఇలాంటి నిర్ణయాలతో తెలంగాణ చేనేత కార్మికుల కడుపు కొడుతోందని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అసత్య ప్రచారాలు మాని..తెలంగాణ నేతన్నకు న్యాయం చేయాలని హితవు పలికారు. 

తెలంగాణ టెక్స్‌టైల్స్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్ కాకతీయకు కేంద్ర సహాయం ఎక్కడ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ కస్టర్ ఏర్పాటు ఏటు పోయిందన్నారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్ టైల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తోపాటు హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదని లేఖలో వివరించారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ ఏర్పాటు ప్రస్తావన ఏమయ్యిందని ప్రశ్నించారు. పవర్ లూం మగ్గాల అప్ గ్రేడేషన్‌కు కేంద్రం నిధుల అంశం ఏమయ్యిందని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి..టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ తగ్గించాలన్నారు. కేంద్ర టెక్స్‌టైల్ శాఖకు మంత్రులు మారుతున్నారు ..కానీ తెలంగాణ సమస్యలను పరిష్కారం కావడం లేదని చెప్పారు. 

ఈ అంశాలన్నింటిపై టీఆర్‌ఎస్ ఎంపీలు పోరాటం చేస్తారని..పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాటికి తెలంగాణ చేనేతలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే దీనిపై ప్రజా పోరాటం చేస్తామన్నారు. నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండన్నారు. కేవలం ప్రకటనలు కాదు..పథకాలు రావాలి..తెలంగాణ టెక్స్‌టైల్, చేనేత రంగానికి ప్రోత్సాహం కావాలని గోయల్‌కు రాసిన లేఖలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

Also read: Kesineni Nani:చంద్రబాబుకు ఇవ్వాల్సిన బొకేను విసిరిగొట్టిన కేశినేని నాని.. టీడీపీలో కలకలం

Also read:Vice President Poll Live Updates: జగదీప్ ధనకర్ వర్సెస్ మార్గరెట్ ఆల్వా.. భారత కొత్త ఉప రాష్ట్రపతి ఎవరో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News