తెలంగాణకు నేడు వర్షసూచన
రాష్ట్రంలో నేడు వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్ : నేడు భాగ్యనగరంతోపాటు తెలంగాణలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మాల్దీవుల నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి వుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ దిశగా కదులుతున్న ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి వర్షసూచన కనిపిస్తోందని, అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.