హైదరాబాద్: గోషామహాల్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణలో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో హిందుత్వ నినాదాన్ని ఆదరించే ఏకైక నియోజకవర్గం. ఇక్కడ అభివృద్ధి కంటే హిందుత్వ నినాదామే గెలుస్తుందని అనేక సార్లు రుజువైంది. కరుడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్ విజయమే ఇందుకు నిదర్శనం.  గత చరిత్ర చూసినా ఈ విషయం తేటతెల్లమౌతుంది . గోషామహల్ ( అప్పట్లో మహారాణిగంజ్ ) లో 1999లో కూడా ఇక్కడి ప్రజలు హిందుత్వ నినాదం వినిపించిన బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ కు పట్టంగట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యలో ముఖేష్ గౌడ్ హవా..
ఆ తర్వాత ముఖేష్ గౌడ్ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకుతో గెలుపొందారు. రెండు పర్యయాలు అంటే 2004,2009లో వరగా రెండు సార్లు గెలుపొందిన ఆయన ఓ సారి మంత్రిత్వ బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారింది. ముఖేష్ కు కాదని హిందుత్వ ఫైర్ బ్యాండ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రజలు పట్టంగట్టి తాము హిందుత్వ వాదానికి ఆదరిస్తామని గోషామహల్ వాసులు మరోసారి నిరూపించారు. దీనికి కారణం ఇక్కడ ఉండే జనాల్లో ఎక్కువగా శాతం ఉత్తరాధి వలస వచ్చిన వారే.. వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లో స్థిరపడాలనుకునే వారు ఎక్కువగా గోషామహల్ నే ఎంచుకుంటారు. కాగా సహజంగా ఉత్తరాధిలో హిందుత్వ నినాదం పనిచేస్తుందనే విషయం బహిరంగ రహస్యం.


గెలుపుపై రాజాసింగ్ ధీమా...
గోషామహాల్ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న రాజాసింగ్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.  హిందుత్వమే ఏకైక ఎజెండాతో రాజాసింగ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో తనకు ముస్లిం ఓట్లు పడకపోయిన పర్వాలేదని.. తాను హిందూ ఓట్లతో గట్టెక్కగల్లుతాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధే తో పాటు హిందుత్వ ఎజెండా తనకు గెలిపిస్తుందంటున్నారు రాజాసింగ్. ఈ సారి ఎన్నికల్లోనూ ఆయన గెలుపుపై ఆత్మవిశ్వాతంతో ఉన్నారు. 


మళ్లీ పట్టుసాధిస్తున్న ముఖేష్..
ఆత్మవిశ్వాసం వేరు జనాల అభిప్రాయం వేరు కదా..ప్రస్తుతం నియోజకవర్గంలో రాజాసింగ్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..ఇదే అంశాన్ని మీడియా కోడై కూస్తోంది. నాలుగేళ్లగా ఉండి నియోజవర్గానికి రాజాసింగ్ చేసింది ఏమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధిగా ముఖేష్ గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఈ సారి ఆయనకు మహాకూటమి బలం కూడా తోడైంది. ఇదే ఆయనకు ప్లస్ పాయింట్ గా మరింది. కూటమిలోని అన్ని పార్టీలు ముఖేష్ కు మద్దతు  ఇ వ్వడంతో పాటు మజ్లీస్ పార్టీ కూడా ఆయన గెలుపుకు సహకరించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజాసింగ్ ను ఎలాగైన ఓడించి తీరుతామని అక్బరుద్దీన్ ఓవైసీ అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. హిందూ జనాభా ఎక్కువగా ఉండే గోషామహల్ లో ఎంఐఎంకు ఎలాగూ గెలిచే పరిస్థితి లేనందను నామామాత్రపు టీఆర్ఎస్ అభ్యర్ధిని మద్దతిస్తే ఓట్లు చీల్చే కంటే  కాంగ్రెస్ పార్టీ ముఖేష్ కు అభ్యర్ధిత్వానికి పరోక్షంగా బలపరిస్తే ఎలాగుంటదని లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. మజ్లీస్ మద్దుతు కూడా లభిస్తే ముఖేష్ గెలుపొందడం ఖాయం అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


గోషామహల్ లో కేవలం హిందుత్వం.. హిందువుల ఓట్లను నమ్ముకుంటున్న రాజాసింగ్ ఓటర్లు ఆదరిస్తారా.. అన్ని పార్టీ మద్దతు కూడగట్టుకొని ..బీసీ ఓటు బ్యాంకుతో బరిలోకి దిగుతున్న ముఖేష్ గౌడ్ గెలుస్తారా అనేది మరి కొన్ని రోజుల్లో తేలనుంది.